Tarakaratna : తారకరత్న మృతిపట్ల చంద్రబాబు సంతాపం

Tarakaratna : తారకరత్న మృతిపట్ల చంద్రబాబు సంతాపం
X
తారకరత్న తిరిగిరాని లోకాలకు చేరడంతో ఆయన కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు

నందమూరి తారకరత్న మృతిపట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు. రంగారెడ్డిలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు దంపతులు తారకరత్న మృతదేహానికి నివాళులు అర్పించారు. తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్నను బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్లో 23 రోజులుగా వైద్యం అందించారు. శనివారం తుది శ్వాస విడిచారు తారకరత్న. తారకరత్న తిరిగిరాని లోకాలకు చేరడంతో ఆయన కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు.

తారకరత్న మృతదేహాన్ని రేపు ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిల్మ్ చాంబర్ లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు సాయంత్రం మహా ప్రస్తానంలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.

Tags

Next Story