TG : త్వరలోనే తార్నాక జంక్షన్ పునఃప్రారంభం

త్వరలోనే తార్నాక జంక్షన్ పునఃప్రారంభం కానుంది.15 రోజుల్లో అధికారులు అందుకు అవసరమైన పనులు పూర్తి చేయనున్నారు. జంక్షన్ ఓపెన్ అయితే యూటర్న్ అవసరం ఉండదు. దీంతో పాటు వాహనదారులకు ప్రయాణ భారం కూడా తగ్గుతోంది. జంక్షన్ పునరుద్ధరణ జరిగితే ప్రయాణికుల ఎనిమిది ఏళ్ల ట్రాఫిక్ సమస్యకు ఇక చెక్ పడనుంది. గతంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ పేరుతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జంక్షన్ ను మూసివేసింది. జంక్షన్ సమీపంలో మెట్రో పిల్లర్ అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ ను నివారించాలని, వాహనాల రాకపోకలు సులువుగా ఉంటుందని, ట్రాఫిక్ పోలీసుల అవసరముండదని అటు రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో, ఇటు ఐఐసీటీ సమీపంలో యూ-టర్న్ లను ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో ట్రాఫిక్ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైంది. ఇటీవల ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ లో పనిచేసే అర్కడేస్ కంపెనీతోపాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక కమిటీ వేసింది. స్టడీ చేసి జంక్షన్ ను తిరిగి ప్రారంభించాలని సిఫారసు చేసింది. దీంతో తార్నాక జంక్షన్ ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com