TG : పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

TG : పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు
X

ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. మధురానగర్‌కు చెందిన వెన్నపూసల మల్లారెడ్డి(35) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఫిలింనగర్‌ రోడ్‌ నెం 8లోని ప్లాట్‌ నెంబర్‌ బి-29 బిల్డింగ్‌లోని ఎఫ్‌ 1 ఫ్లాట్‌లో పేకాట శిబిరం నడిపిస్తున్నాడన్న సమాచారం మేరకు వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాడుతున్న నిర్వాహకుడు మల్లారెడ్డితో పాటు ఫల్గుణరావు(30), ఉప్పు మాల్యాద్రి(54), కురిటి శ్రీనివాసరావు(62), గిరమైన నాగరాజు(32) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.06లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఫిలింనగర్‌ పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న మహ్మద్‌ నయీముద్దీన్‌(63) అనే వ్యక్తి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు చేసిన పోలీసులు 8మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.27,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై గేమింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story