Telangana: తెలంగాణలో మళ్లీ అధికారం చేజిక్కించుకునే దిశగా టీడీపీ అడుగులు..

Telangana: తెలంగాణలో మళ్లీ అధికారం చేజిక్కించుకునే దిశగా టీడీపీ అడుగులు..
X
Telangana: తెలంగాణలో మళ్లీ అధికారం చేజిక్కించుకునే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది తెలుగుదేశం పార్టీ.

Telangana: తెలంగాణలో మళ్లీ అధికారం చేజిక్కించుకునే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది తెలుగుదేశం పార్టీ. నాయకులు వెళ్లిపోయినా.. ఇప్పటికీ క్యాడర్ మాత్రం టీడీపీని అంటిపెట్టుకుని అలాగే ఉంది. ఆ మాటకొస్తే.. తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదనేది వాస్తవం. బలహీనవర్గాలను పైకి తీసుకొచ్చిన పార్టీగా తెలంగాణలోని బీసీల్లో ఇప్పటికీ టీడీపీ అంటే అభిమానం, గౌరవమే.



ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్‌ టీడీపీ సొంతం. ఇన్నాళ్లు ఒకలా.. ఇక నుంచి మరోలా అనే రీతిలో తెలంగాణలో తెలుగుదేశం బలపడుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో బలమైన పార్టీగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది.


తెలంగాణలో ఇప్పటికీ గ్రామ గ్రామాన టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. ఉద్యమం సమయంలోనూ తెలంగాణ ప్రజల ఆదరణ పొందిందీ టీడీపీ. అందుకే, 2014లో జరిగిన ఎన్నికల్లో 15 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 2018 ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలిచింది. వచ్చే ఎన్నికల్లో మరింత సత్తా చాటేలా ప్రణాళికలు వేస్తోంది.



ఇప్పటికే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బలమైన నేతలు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. వివిధ జిల్లాల నేతలు మళ్లీ టీడీపీ గూటికి చేరుతున్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నది టీడీపీకే అనేది విశ్లేషకుల మాట. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి చెక్కుచెదరని క్యాడర్‌ ఉండడం పార్టీకి ఉన్న బలం.


బీసీల్లో టీడీపీ పట్ల అప్పుడు ఇప్పుడు అదే ఆదరణ కనిపిస్తోంది. నేతలు పార్టీని వీడినా.. అభిమానులు, క్యాడర్‌ మాత్రం టీడీపీతోనే ఉంది. అందుకే, వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలపై టీటీడీపీ ఫోకస్‌ పెట్టింది. ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందనేది ముమ్మాటికీ వాస్తవం.



అటు తెలంగాణవ్యాప్తంగానూ భారీ సంఖ్యంలో టీడీపీకి కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బీసీలు, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి తెలంగాణలో టీడీపీ పాగా వేయడానికి ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా.. వారికి అండగా నిలిచే ఒకే ఒక్క పార్టీగా నిలబడింది టీడీపీ.



అందుకే, తెలంగాణలోనూ పూర్వవైభవం ఖాయమంటున్నారు టీటీడీపీ శ్రేణులు. ముఖ్యంగా టీటీడీపీ అధ్యక్షుడుగా కాసాని జ్ఞానేశ్వర్ రాకతో పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు. ప్రజాసమస్యలపై పోరును మరింత ఉధృతం చేస్తూ.. ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి కాసాని నాయకత్వంలోని టీడీపీ సమాయత్తం అవుతోంది.


ఖమ్మం టీడీపీ బహిరంగ సభతో తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీల్లో ఆందోళన కూడా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది.. తెలంగాణలో టీడీపీ తిరిగి బలాన్ని పుంజుకుంటే ఆ ప్రభావం తమ పార్టీలపై కచ్చితంగా కనబడుతుందనే భయం పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.. ఖమ్మం జిల్లాలో టీడీపీ ఏస్థాయిలో పట్టుందో గత ఎన్నికలే గుర్తు చేస్తున్నాయి.. కాబట్టి, టీడీపీని అంత తక్కువ అంచనా వేయకూడదని కొందరు సీనియర్లు విశ్లేషిస్తున్నారు.



ఇప్పుడు అదే ఖమ్మం నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత చంద్రబాబు ఫోకస్‌ చేయడం.. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ఇది ఆ పార్టీకి మరింత కీలకంగా మారనుందనే చర్చ జరుగుతోంది. ఈ సభ ద్వారా కొత్త కేడర్‌ను, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుని ఎన్నికలకు వెళ్తామని.. అధికార, విపక్షాలను ఢీకొట్టి సైకిల్‌ సత్తా ఏంటో చూపిస్తామని జిల్లా టీడీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు..

Tags

Next Story