Tech Mahindra University: కరోనా బారిన పడిన మరో యూనివర్సిటీ.. మొన్న కర్ణాటక.. నేడు హైదరాబాద్..

Tech Mahindra University: కరోనా వ్యాప్తి తగ్గిపోయింది.. ఇంతకు ముందు లాగా దాని ప్రభావం లేదు.. ఇంక మన జీవితాలు మామూలుగా మారిపోయాయి.. ఇటీవల ప్రజల నుండి వినిపిస్తు్న్న అభిప్రాయాలు ఇవి. కానీ అక్కడక్కడా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే వీరి అభిప్రాయాలు తప్పని స్పష్టమవుతోంది. ఇటీవల కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీ వల్ల ఎక్కువగా కరోనా వ్యాప్తి జరిగింది. అదే తరహాలో హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ కాలేజ్‌లో జరిగింది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బహదూర్‌పల్లిలోని టెక్ మహేంద్ర యూనివర్సిటీలో కరోనా విజృంభణ మొదలయ్యింది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఒక్కసారిగా వర్సిటీలోని విద్యార్థులకు కరోనా తెలియగానే యాజమాన్యం ఈరోజు, రేపు సెలవులు ప్రకటించింది. భయంతో వర్సిటీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు కూడా ఖాళీ చేశారు.
యూనివర్సిటీలో 25మంది విద్యార్థులకు మాత్రమే కాదు అయిదుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే వీరందిరినీ హోమ్ క్వారంటీన్‌లో ఉండమని వైద్యులు సూచించారు. ఎంతమంది విద్యార్థులకు కరోనా సోకిందో క్లారిటీ లేదు కాబట్టి క్యాంపస్ మొత్తం శానిటైజేషన్ చేసిన తర్వాతే మళ్లీ క్లాసులు మొదలవుతాయని యాజమాన్యం అంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com