Hyderabad Metro : మెట్రో ట్రైన్లలో టెక్నికల్ సమస్య.. నిలిచిపోయిన రైళ్లు

Hyderabad Metro : మెట్రో ట్రైన్లలో టెక్నికల్ సమస్య.. నిలిచిపోయిన రైళ్లు
X

హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్ -రాయదుర్గం, ఎల్బీ నగర్ - మియాపూర్ కారిడార్లలో ట్రైన్లు నిలిచిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయం కావటంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రైన్లు సకాలంలో రాకపోవటంతో మెట్రో ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. ట్రైన్లలో ఉన్నవారు ట్రైన్లలో.. స్టేషన్లలో ఉన్నవారు స్టేషన్లలోనే ఉండిపోయారు. అయితే ఈ అంతరాయంపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Tags

Next Story