Telangana: పోలీసులపై దాడి చేసిన తండావాసులు

Telangana: పోలీసులపై దాడి చేసిన తండావాసులు
తీవ్రంగా గాయపడిన పోలీసులు

యాదాద్రి జిల్లా గద్దరాళ్లతండాలో పోలీసులపై దాడి జరిగింది. ఉద్దమర్రి వైన్స్‌ కాల్పుల ఘటన దర్యాప్తులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున గద్దరాళ్లతండాకు మఫ్టీలో వెళ్లారు శామీర్‌పేట పోలీసులు. మఫ్టీలో ఉన్న పోలీసులను దొంగలుగా భావించిన తండావాసులు ఐడీ కార్డులు చూపించమని అడిగారు. ఐడీకార్డులు లేకపోవడంతో వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులను తండాలోనే బంధించారు.

సమాచారం అందుకున్న భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి హుటాహుటినా గద్దరాళ్లతండాకు చేరుకున్నారు. వచ్చిన వారు నకిలీ కాదని రియల్ పోలీసులని గ్రామస్తులకు తెలిపారు. ఉద్దమర్రి కాల్పుల ఘటనలో విచారణకు వచ్చారని వివరించారు. దాంతో తండావాసులు పోలీసులను విడిచిపెట్టారు. గ్రామస్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన అల్వాల్, శామీర్‌పేట ఎస్‌ఐలు, డిటెక్టీవ్ సీఐ, సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన తండావాసులపై శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story