Telangana: ఇంటర్ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం అయ్యింది. గత నెల కన్పించకుండా పోయిన నిఖిల్ కుమార్ అనే విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు. నిఖిల్ కుమార్ మృతదేహాన్ని చారీనగర్ వద్ద నీటి గుంటలో గుర్తించారు. మొండెం మాత్రమే లభ్యం కాగా, తల కోసం నీటి గుంటలో పోలీసులు గాలిస్తున్నారు. ఇక జనవరి 21 నిఖిల్ కుమార్ కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నెల రోజుల తరువాత నిఖిల్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిఖిల్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక నిఖిల్ మృతిపై పలు కోణాల్లో విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com