CM Revanth Reddy : 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ

CM Revanth Reddy : 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ
X

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీని కోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. ఇందులో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుందని చెప్పారు, రామాయణం, మహా భారతం మన జీవితా ల్లో భాగమని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'శ్రీమద్ భాగవతం పార్ట్ 1’ ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. '2035లోగా తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దాలని మేం సంకల్పించాం. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే యూనిక్ఆూడియో. ఇది తె లంగాణలో ఉండటం మనకు గర్వకారణం. శ్రీమద్ భాగవతం చిత్రం తీయాలన్న ఆలోచన వచ్చినందుకు మూవీ టీమ్ ను అభినందిస్తు న్న. 40 ఏండ్ల కిందట రామాయణం సీరియల్ అందరికీ చేరువైంది. కోవిడ్ టైమ్ లో మళ్లీ సీరియల్ ను టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికార్డు సృష్టించింది' అని తెలిపారు.

Tags

Next Story