TG : కులగణనకు అంతా రెడీ.. నవంబర్ ఆరు నుంచే మొదలు
కులగణకు తెలంగాణ రాష్ట్రంలో అంతా సిద్ధమైంది. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. నవంబరు 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న కులగణనపై పార్టీ పరంగా లోతుగా చర్చించి, దీనిపై పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపి, వెనకబడిన కులాలకు తగిన ప్రయోజనం చేకూరేలా పథకాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. నవంబరు 6 నుంచి తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కులగణన కోసం 80 వేల మంది ఉద్యోగులను కేటాయించి ఇంటింటి సర్వేతో పక్కాగా గణాంకాలు సేకరించనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com