ఈ నెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. !

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం, ఆర్ధిక పరిస్థితి వంటి అంశాలను చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినేట్ సమావేశం నిర్వహించి దళిత బంధు గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిరుద్యోగ బంధు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. రెండు రోజుల్లో గవర్నర్ ను కేసీఆర్ కలవనున్నారు. 10రోజులపాటు సమావేశాల్ని నిర్వహించే ఛాన్స్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com