TG : మొదలైన ఇంటింటి సర్వే.. ఒంటి పూట బడులు ప్రారంభం

X
By - Manikanta |6 Nov 2024 3:45 PM IST
తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పేరిట కులగణన ప్రక్రియ మొదలైంది. కులాలవారీగా.. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి స్థితిగతులపై ఈ సర్వేలో సమాచారాన్ని సేకరిస్తోంది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి.. తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేయడమే ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 75 ప్రశ్నలతో ప్రతి కుటుంబానికీ చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ 3 వారాల పాటు నెలంతా కొనసాగనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com