TS : రూ. 3 కోట్ల బడ్జెట్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం సుమారు రూ. 3 కోట్ల బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మధ్యాహ్నాం 12 గంటలకు శాసనసభలో అర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Batti Vikramarka), మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని అర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు అమలు చేసేందుకు దాదాపుగా రూ.60 వేల కోట్లకు పైగా అవసరం అవుతాయని అంచనా వేసింది. ఈ క్రమంలో సంక్షేమ, వ్యవసాయ, విద్యుత్ రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. మహిళలకు ప్రతినెల రూ.2500 అమలుకు రూ. 20 వేల కోట్లు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కు రూ. 4,200 వేల కోట్లు, ఉచిత ప్రయాణానికి రూ.5 వేల కోట్లు కావాల్సి ఉంది.
మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com