Telangana Cabinet Meeting : మార్చి 6న తెలంగాణ క్యాబినెట్ భేటీ

Telangana Cabinet Meeting : మార్చి 6న తెలంగాణ క్యాబినెట్ భేటీ
X

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులపై చర్చించనుంది. వీటిని ఆమోదించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. అనంతరం వాటిని పార్లమెంటుకు పంపి చట్టం చేయాలని కేంద్రాన్ని కోరనుంది. ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

బీసీ రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డితో పాటు మొత్తం మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా కలుపుకుని ప్రధాని మోదీని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా కేబినెట్‌‌‌‌‌‌‌‌లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్​సమావేశాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.

పార్లమెంట్​సమావేశాలు ఈ నెల 10న మొదలవుతున్నందున.. అంతకంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని యోచిస్తున్నది. లేదంటే పార్లమెంట్​సమావేశాల రోజే అసెంబ్లీ బడ్జెట్​సమావేశాలను మొదలుపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నది. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి, అనంతరం మరుసటి రోజు బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపి సభను ఒకట్రెండు రోజులు వాయిదా వేసి ఢిల్లీ వెళ్లాలని అనుకుంటున్నారు.

Tags

Next Story