Telangana Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
X

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ ఉంటుందని సమాచారం. వర్షాకాల శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలు, అలాగే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన చర్యలపై మంత్రిమండలి చర్చిస్తుంది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, రైతు భరోసా పథకం నిధుల విడుదల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదిక, దానిపై భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలు చర్చకు రావచ్చు.ఈ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు సమావేశం తర్వాత వెల్లడవుతాయి.

Tags

Next Story