TG: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

TG: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
X
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం...మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. దక్షిణ కొరియాలో రూ.4500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకు వచ్చాయి. రూ.4500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. మొత్తం 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

మా పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదు

తెలంగాణ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని.. ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే.. ఇక్కడి నుంచి పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించారని, కానీ తమ పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో కాదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ‘కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌’ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ప్రపంచంలోనే మరెక్కడా లేదన్నారు. పరిశ్రమలు, సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత లభిస్తుందని, నిపుణులైన యువశక్తికి తెలంగాణలో కొదవ లేదని ధీమా వ్యక్తం చేశారు. ‘ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను నిలపాలనేది మా సంకల్పం. చైనా ప్లస్‌ 1 కంట్రీ కోసం ఆలోచిస్తున్న అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలకు మేం నిర్మించే ఫ్యూచర్‌ సిటీ గమ్యస్థానమవుతుంది. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధే నిరూపిస్తుంది’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

‘‘అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల ద్వారా రాష్ట్రానికి రూ.36,000 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని రేవంత్‌ అన్నారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని వెల్లడించారు. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల కోసం ఇన్వెస్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.



Tags

Next Story