REVANTH: సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి: రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

REVANTH:  సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి: రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి
X
కేంద్రమంత్రులతో రేవంత్‌రెడ్డి భేటీ.. అమిత్‌ షాతోనూ భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్టర్‌ ప్లాన్‌ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని సీఎం విజ్ఞప్తి చేశారు. రూ. 17 వేల కోట్లతో 7,444 కి. మీ మేర సీఎస్ఎంపీకి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. సీఎస్‌ఎంపీని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరారు.

అమిత్‌ షాతోనూ బేటీ

తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం అనంతరం.. అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు రెండు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి వరద సాయం నిధుల అంశం కాగా.. మూసీ ప్రక్షాళనకు నిధులు అంశం మరొకటి. అయితే.. తెలంగాణకు ఇప్పటికే.. వరద సాయం నిధులు విడుదల చేయగా.. అవి సరిపోవని.. వరద సాయం పెంచాలని అమిషాను రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

సాయంపైనా వినతి

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 1036 కోట్ల నిధులు విడుదల చేయగా.. తెలంగాణకు మాత్రం కేవలం 416 కోట్ల 80 లక్షలు మాత్రమే విడుదల చేసింది. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా.. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయని.. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించి వరదలు పోటెత్తాయని.. చాలా నష్టం వాటిల్లిందని అమిత్ షాకు రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది.

Tags

Next Story