TG: హైడ్రాపై సీఎస్ కీలక సమీక్ష

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక సమావేశం నిర్వహించారు. కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు ఇటీవల ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈక్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఏంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.
ఎవ్వరినీ వదలబోం
ఆక్రమణలు జరిగాయా... లేదా... అనేది చూసి కూల్చుతామే తప్ప ఏ పార్టీ వారు ఆక్రమించుకున్నారని కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చెరువులు, లేక్‌ల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు, నాలాలు, పార్కుల పరిధిలో ఆక్రమణలు ఉన్నాయా లేదా అన్నది ఒక్కటే గీటురాయని స్పష్టంచేశారు. ఆక్రమణల తొలగింపులో రాజీ ప్రసక్తే లేదు. ఒత్తిళ్లకు తలొగ్గబోమని రేవంత్ స్పష్టం చేశారు. ఆక్రమణలు చేసింది కాంగ్రెస్సా, బీజేపీనా మరో పార్టీనా... అది ఓల్డ్ సిటీనా ఇంకో ప్రాంతమా అన్నది ముఖ్యం కాదన్నారు. ఆక్రమణలు జరిగాయా లేదా అన్నదే ప్రధానమని తెలిపారు. వెనక్కు తగ్గే ప్రసక్తేలేదని.. కూల్చివేతలు తప్పవన్నారు. ఈ పని చేయకుంటే మున్ముందు హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారుతుందన్నారు. ఇప్పటికే వర్షం కురిస్తే నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయన్నారు.
ఆక్రమణలపై హైడ్రా చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపు, జన్వాడ ఫాంహౌస్, రుణమాఫీ, కవిత బెయిల్ ఇలా అనేక అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లవి, ఓల్డ్ సిటీలో ఉన్న వాటిని టచ్ చేసి చూడాలని కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ... ‘‘మొదట కూల్చిందే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు(సీడబ్ల్యూసీ) పల్లంరాజుదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో ఇంతకంటే ఉన్నత స్థానం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలపై ఒత్తిడి భరించాల్సిందేనని, ఇప్పటికే దాన్ని అనుభవిస్తున్నానని, అయినా హైదరాబాద్ నగర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ తప్పవన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com