TS: తెలంగాణలో 3,30,37,113 మంది ఓటర్లు

TS: తెలంగాణలో 3,30,37,113 మంది ఓటర్లు
X

తెలంగాణలో (Telangana) ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 3,30,37,113 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికం కావడం విశేషం. మొత్తం 3,30,37,113 ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు ఉండగా, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 7,19,104 మంది ఓటర్లను కొత్తగా చేర్చినట్టు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. 5,26,867 ఓటర్లను జాబితా నుంచి తొలగించామని స్పష్టం చేశారు.

మొత్తం ఓటర్లలో 80 ఏండ్లు దాటినవారు 4,54, 230 మంది ఉండగా, దివ్యాంగులు 5,28,405 మంది ఉన్నట్టు తెలిపారు. స్త్రీపురుష ఓటర్ల నిష్పత్తి 1000:1009గా ఉన్నట్టు పేర్కొన్నారు. గత నవంబరులో 3,26,02,793 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల మూడో తేదీ వరకు 4,34,320 మంది అదనంగా చేరారు.

అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి (Serilingampally) మరోమారు టాప్‌ ప్లేస్‌లో నిలువగా... ఆ తరువాత 7,12,868 మంది ఓటర్లతో మేడ్చల్‌ (Medchal) వరుసగా రెండుమూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా ఎల్బీనగర్‌ (6,00, 500), రాజేంద్రనగర్‌ (5,99, 678) నిలిచాయి. అతి తక్కువగా భద్రాచలంలో (Badrachalam) 1,51,940 మంది ఓటర్లు ఉండగా, అశ్వారావుపేటలో (Ashwaraopeta) 1,58,274, బెల్లంపల్లిలో 1,75,508, చెన్నూరులో 1,93, 379, మంది ఓటర్లు ఉన్నారు.

Tags

Next Story