TG: యమ"పాశం"

సంగారెడ్డి పాశ మైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పేలుడు శబ్దంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 44 మంది కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 35 మందికి పైగా కార్మికులకు తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవాన్ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్ ఉదయం ప్లాంటులోకి వచ్చిన సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని ఆయన కారు నుజ్జునుజ్జు అయింది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు.రియాక్టర్ ఛాంబర్ భవనం కుప్పకూలగా.. మరో భవనం బీటలు వారింది. ప్రమాద స్థలిలో కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లి పోయింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమైనట్టుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్, ఎస్పీ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కంపెనీలో 100మంది పని...
ఈ కంపెనీలో మెడిసిన్స్ కి సంబంధించిన పౌడర్ తయారు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారని చెబుతున్నారు. కంపెనీలో దాదాపు 100 మంది వరకు పనిచేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. కంపెనీలో పనిచేస్తున్న తమ వాళ్లకు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయటం లేదని చెబుతున్నారు. ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఫ్యాక్టరీ లోపల చిక్కుకున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com