Telangana Global Summit : గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు....

Telangana Global Summit : గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు....
X

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రపంచ టెక్ దిగ్గజాలు, ఇంటర్నేషనల్ పాపులర్ వ్యక్తులు, మెస్సీ లాంటి గ్లోబల్ స్టార్లు, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, సెలబ్రిటీలు వస్తుండటంతో తెలంగాణ సంప్రదాయాలు ఉన్న పడేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సి ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పెద్ద పని చేశారు అని ప్రశ్నించే ప్రతిపక్షాలకు దీన్ని చూపించాలని రేవంత్ రెడ్డి ముందు నుంచే భావిస్తున్నారు.

తమ ప్రభుత్వం కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వరకే ఆగిపోదని.. ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్మెంట్ కూడా చేస్తుందనీ చాటి చెప్పేందుకు దీన్ని ఆ విధంగా మలుచుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకోసం భారీ భద్రతతో పాటు.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఏర్పాట్లు, అదిరిపోయే స్టేజ్, మెస్సీతో రేవంత్ రెడ్డి గేమ్, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చెప్పే ప్రజెంటేషన్లు కూడా రెడీ చేశారు. తెలంగాణ మర్యాదలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా చూపించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ వంటకాలు, జానపద గీతాలు, సంగీతం, సంప్రదాయ పద్ధతుల గురించి ఇందులో చూపించబోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ అంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక వేదికగా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీలు, ఇక్కడ తయారవుతున్న ఫార్మా మందులు, ఇతర బ్రాండ్ వస్తువుల గురించి ఇందులో ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీంతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ హయాంలోనే భారీగా పెంచేసి తను కేవలం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదని విజన్ ఉన్న లీడర్ అని రేవంత్ నిరూపించుకోవాలని భావిస్తున్నారు. నేడు, రేపు జరిగే గ్లోబల్ సమ్మిట్ లో రేవంత్ అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకుంటారా లేదా అనేది చూడాలి.


Tags

Next Story