TG : సన్నరకం ధాన్యానికి రూ.939 కోట్ల బోనస్

TG : సన్నరకం ధాన్యానికి రూ.939 కోట్ల బోనస్
X

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 18.78 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వీటికి రూ.939 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.531 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 6 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ ముందు వరుసలో ఉన్నాయి. 2024 ఖరీఫ్‌లో 8.84 లక్షల మంది రైతుల నుంచి 47.01 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసి రూ.10,149 కోట్లను చెల్లించింది. వీటిలో 18.78 లక్షల టన్నుల సన్న రకానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 8,318 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. గత ఏడాది(2023) ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా... ఈసారి అంతకంటే ఆరు లక్షల టన్నులు ఎక్కువ సేకరించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించడంతో ఈసారి సన్న రకాల వరి విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. 2023 ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం వరి సాగు విస్తీర్ణంలో 38% (25.05 లక్షల ఎకరాల్లో) సన్న రకాలను వేశారు. ఈ ఖరీఫ్‌లో (2024) రికార్డు స్థాయిలో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అందులో 61% (40.55 లక్షల ఎకరాల్లో) రైతులు సన్నరకం వరిని సాగు చేశారు.

Tags

Next Story