Telangana Government : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 2,363 పోస్టుల భర్తీ కి పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం వచ్చిన ప్రతిపాదనలకు స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలను కాంట్రాక్ట్, మినిమం టైమ్ స్కేల్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో చేపట్టనున్నారు. 944 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, 87 పోస్టులు మినిమం టైమ్ స్కేల్ విధానంలో, మరో 1,332 పోస్టులు ఔట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com