TG : లగచర్ల దాడి దుండగులను శిక్షించండి.. గవర్నర్‌కు ఉద్యోగుల విన్నపం

TG : లగచర్ల దాడి దుండగులను శిక్షించండి.. గవర్నర్‌కు ఉద్యోగుల విన్నపం
X

లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన నిందితులు, దాడికి ప్రేరేపించిన కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కోరారు. జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి నేతృత్వంలో అధికారులు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి వినతిప‌త్రం స‌మ‌ర్పించారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలను గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. రైతుల మాటున కొంద‌రు దుండ‌గులు అధికారుల‌పై దాడికి పాల్ప‌డ‌టం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసింద‌ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌కూ విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌నే ఆందోళ‌న ఉద్యోగుల్లో నెల‌కొంద‌ని పేర్కొన్నారు.

Tags

Next Story