TG : తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు.. లక్ష్యాలు ఇవే

TG : తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు.. లక్ష్యాలు ఇవే

తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ) నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర ప్రభుత్వ విధానాన్ని ఈ కమిషన్ రూపొందిస్తుందని.. అందుకే విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ కమిషన్లో ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. కమిషన్ చైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. చైర్మన్, సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతోపాటు.. అంగన్ వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. దీనిలో భాగం గానే విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.

Tags

Next Story