TG : తెలంగాణలో ఇంటింటి సర్వేలో సేకరించే అంశాలు ఇవే

తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వేకు అంతా సిద్ధం చేసింది రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం.. ఈ మేరకు 2024, అక్టోబర్ 29న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్‌ను రిలీజ్ చేసింది. 2024, నవంబర్ 6వ తేదీ నుండి ఈ సర్వే మొదలు కానుంది. ఈ ఫామ్‌లో అధికారులు సేకరించనున్న వివరాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం వెల్లడించింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు మొత్తం రెండు పార్టీలుగా వివరాలు సేకరించనున్నారు. కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అధికారులు నమోదు చేసుకోనున్నారు. ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరించనున్నారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు వారి భూములు, రిజర్వేషన్లు, రాజకీయ నేపథ్య వివరాలను సైతం అధికారులు అడిగి తెలుసుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com