Telangana Assembly : వాడిగా వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly : వాడిగా వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగాయి. ప్రశ్నోత్తరాలు, రెండు బిల్స్‌తో పాటు 6 పద్దులపై చర్చ చేపట్టారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగాయి. ప్రశ్నోత్తరాలు, రెండు బిల్స్‌తో పాటు 6 పద్దులపై చర్చ చేపట్టారు. సాంకేతిక విద్య, పర్యాటకం, ఆరోగ్యం, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, లేబర్ ఎంప్లాయిమెంట్, అడవుల అభివృద్ధిపై సభలో చర్చించారు. పట్టాణాభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంపై విరుచకుపడ్డారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో వరదలు ముంచెత్తినా కేంద్రం ఒక్కపైసాకూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. సహాయం చేయాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

హైదరాబాద్ నగర అభివృద్దికి కంటోన్మెంట్ జోన్లు అడ్డుగాఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. వారు ఓ స్వతంత్య్ర దేశంగా భావిస్తూ ప్రతిపనికి అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. ఇక నుంచి తీవ్రమైన చర్యలకు కూడా వెనుకాడమన్నారు. ప్రజలకోసం ఎంతకైనా తెగిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.. ఇక ఆరోగ్యంపై అసెంబ్లీలో వాడివేడీ చర్చ జరిగింది. ఆసుపత్రుల ఆధునీకరణ, మౌలిక సదుపాయల సౌకర్యాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి హరీష్‌ సమాధానమిచ్చారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందన్నారు హరీష్‌.

ఇక మన ఊరు-మన బడిపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ కౌంటర్లు, టీఆర్‌ఎస్‌ ప్రతి కౌంటర్లతో హాట్‌హాట్‌గా సాగింది. ప్రత్యేక నిధులు కేటాయించకుండా అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధిల నుంచి ఖర్చు చేయాలనే విధానాన్ని తప్పుబట్టారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. దీనికి మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇస్తూ.. 60 ఏళ్ల నుంచి ప్రభుత్వ బడులు ఎట్లా గబ్బుపట్టి ఉన్నాయో, అట్లాడే ఉండాలన్నది కాంగ్రెస్‌ విధానమా అంటు ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, తలసాని కూడా కాంగ్రెస్‌ సభ్యులపై విరుచుపడ్డారు.

అంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే రసమయి మధ్య సంవాదం జరిగింది. రసమయి ప్రశ్న అడుగుతుండగా... మైక్‌ కట్ చేశారు డిప్యూటీ స్పీకర్‌. ప్రసంగాలు కాకుండా... సూటిగా ప్రశ్నలు అడగాలంటూ.. రసమయికి సూచించారు డిప్యూటీ స్పీకర్‌. తన మైక్‌ కట్‌ చేయడంతో.. ఎమ్మెల్యే రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే అవకాశం రాదని, వచ్చినప్పుడు ప్రశ్నలు అడగవద్దంటే ఎలా అని ప్రశ్నించారు రసమయి. అటు ఆసుపత్రిలో వైద్యుల లేకపోవడాన్ని ప్రస్తావించారు భట్టి విక్రమార్క. రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల, పారామెడికల్‌ సిబ్బంది ఖాళీలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మొత్తానికి... అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story