Telangana : అభయహస్తం రేషన్ కిట్ లో పంపిణీ చేసే వస్తువులు ఇవే

పేదలు, సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో సంక్షేమ కార్య క్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా నిరు పేదలకు సన్న బియ్యాన్ని తెలంగాణ సర్కారు అందిస్తోంది. తాజాగా సన్నబియ్యంతోపాటు నిత్యావసర సరుకుల కిట్ను అందించేందుకు సన్నద్ధమైంది. దీంతో త్వరలోనే చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ పంపిణీ కానుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమ్మ హస్తం పేరుతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాసంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రతీ నెలా తొమ్మిది నిత్యవసర ఆహార వస్తువులను సబ్సిడీతో రూ.185కు అందించేది. అప్పట్లో ఈ పథకాన్ని 2013 ఏప్రిల్లో ఉగాది రోజు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమా ర్ రెడ్డి ప్రారంభించారు. రేషన్ షాపుల్లో అమ్మహస్తం పేరుతో బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో గోధుమపిండి, అరకిలో చక్కెర, అర కిలో చింత పండు, కిలో ఉప్పు, 250 గ్రాముల కారంపొడి, వంద గ్రాముల పసుపు, లీటర్ కిరోసిన్ ఇచ్చేది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన పథకం తరహాలోనే మళ్లీ ఇప్పుడు తెలంగాణలో నిత్యావసర రేషన్ కిట్ల పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళి కలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల కిట్లో వంట నూనెతోపాటు కంది పప్పు, పంచదార తదితర సరుకు లు ఉండబోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు భగ్గుమంటు న్నాయి. కిలో వంటనూనె ధర రూ. 150 దాకా పలుకుతోంది. కందిపప్పు ధర కూడా కిలో రూ.150దాకా చేరింది. ఇక సప్లయిల్లో ఏ చిన్న తేడా వచ్చినా నూనె లు, పప్పులు, మిరప కారం తదితర కొన్ని నిత్యావ సరాల ధరలు ఆకాశన్నంటు తున్నాయి. ఏటా ఇదే తంతు జరుగుతుండడంతో పేదలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఈ నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో అందించే నిత్యావసరాల కిట్ తో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com