Telangana : కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు

Telangana : కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు
X

33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం నమూనాలోనే ఈ విగ్రహాలూ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 అడుగుల ఎత్తులో విగ్రహం, బేస్‌మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 16 అడుగుల ఎత్తు ఉండనుంది. ఒక్కో దానికి ₹17.5 లక్షల చొప్పున ఖర్చు కానుండగా, 33 జిల్లాలకు ₹5.77 కోట్లు అవుతుంది.ఈ విగ్రహాలను సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. 33 జిల్లాల కలెక్టరేట్లలో 20 అడుగుల ఎత్తులో విగ్రహాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారట. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారట.

Tags

Next Story