Telangana: 8 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సర్కారు మరో మైలురాయికి చేరుకుంది.రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల, నారాయణపేట, ములుగు, యాదాద్రి, మెదక్, నర్సంపేట, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిలో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఒక్కో కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మొత్తం 800 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ 8 కాలేజీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరుతుంది. ప్రస్తుతం తెలంగాణలోని సర్కారు వైద్య కళాశాలల్లో 3790 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో వైద్య విద్య విప్లవం ఆవిస్కృతం అవుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com