దళిత బంధు పథకానికి రూ.500 కోట్ల నిధులు విడుదల

X
By - Gunnesh UV |26 Aug 2021 3:24 PM IST
Telangana: దళిత బంధు పథకానికి మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.
దళిత బంధు పథకానికి మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదలయ్యాయి. దళిత బంధు పథకం ప్రాజెక్టు కోసం హుజురాబాద్ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ 2 వేల కోట్లు నిధులు లక్ష్యంగా ప్రకటించారు. ఇవాళ విడుదల చేసిన 500 కోట్లతో ఈ లక్ష్యం పూర్తైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. అటు.. రేపు సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటించనున్నారు. దళిత బంధు పథకంపై ఆయన సమీక్షించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com