Telangana DH Srinivas: ఎక్కువ కరోనా కేసులు ఆ జిల్లాలో నమోదవుతున్నాయి: డీహెచ్ శ్రీనివాస్‌

Telangana DH Srinivas: ఎక్కువ కరోనా కేసులు ఆ జిల్లాలో నమోదవుతున్నాయి: డీహెచ్ శ్రీనివాస్‌
X
Telangana DH Srinivas: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.

Telangana DH Srinivas: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌. మూడు రోజుల నుండి రాష్ట్రంలో వంద చొప్పున కేసులు పెరుగుతున్నాయన్నారు. గత మూడు నెలల తర్వాత కేసుల పెరుగుదల కనిపిస్తుందని.. ఎక్కువ కేసులు హైదరాబాద్‌, రంగారెడ్డిలో నమోదవున్నాయని చెప్పారు. కరోనా ఇంకా పోలేదని.. ప్రజలు జాగ్రతలు పాటించాలని సూచించారు. ఇప్పుడు వస్తున్న కేసుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ నెల 3 నుండి ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. జూన్ 13 నుండి విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయని.. అంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.

Tags

Next Story