Telangana High Court : ఫైన్లు వేయండి.. రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు సీరియస్

Telangana High Court : ఫైన్లు వేయండి.. రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు సీరియస్
X

హైదరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఇకపై హైదరాబాద్‌లో బైక్‌ రైడర్స్‌ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ఆదేశించింది. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. హెల్మెట్ లేకుండా బైక్‌ నడిపితే గతంలో విధించే 100 రూపాయల జరిమానాను 200 రూపాయలకు పెంచింది. అలాగే రాంగ్ రూట్లో వాహనం నడిపితే.. ఇది వరకు 1000 రూపాయలు జరిమానా చెల్లించాల్సిన ఉండగా .. ఇప్పుడు 2000 రూపాయలు జరిమానా చెల్లించాలి. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పబ్‌ల ఎదుట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది.

Tags

Next Story