TG : ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

X
By - Manikanta |6 Nov 2024 6:00 PM IST
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 6 నుంచి 26 వరకు పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ.1000 అపరాద రుసుంతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు. ఫస్టియర్, సెకెండియర్ జనరల్ విద్యార్థులు రూ.520, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలని బోర్డు తెలిపింది. సెకెండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులు రూ.520, సెకెండియర్ జనరల్ సైన్స్ విద్యార్థులు రూ.750 చెల్లించాలని స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com