KTR : ఏపీలో నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు అధ్వాన్నం : మంత్రి కేటీఆర్

KTR : ఏపీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏపీలో నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభించిన అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉంటుందని సొంతూర్లకు వెళ్లి వచ్చిన తన ఫ్రెండ్సే చెప్పారన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్కరాష్ట్రానికి కారేసుకొని వెళ్లిరావాలన్నారు కేటీఆర్. బెంగళూరు కంపెనీలు కూడా ఏపీలో రోడ్ల పరిస్థితిపై మండిపడుతున్నాయన్నారు.
ఆయా రాష్ట్రాల్లో మనవాళ్లు పర్యటిస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. తాను చెప్పేది అతిశయోక్తి కాదని... పక్క రాష్ట్రం వెళ్లి వచ్చిన ఉత్తరాది ఎంపీనే చెప్పారన్నారు. తెలంగాణ ప్రశాంతమైన రాష్ట్రమని.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
దేశంలో అత్యుత్తమ నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com