TG : విత్తనోత్పత్తిలో తెలంగాణ టాప్ : మంత్రి తుమ్మల

విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. విత్తన రంగ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఫిక్కీ భవన్ లో గురువారం సీడ్మెన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అన్ని విత్తన కంపెనీలకు సీడ్మెన్ అసోసియేషన్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణను విత్తనోత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారన్నారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షల ఎకరాలలో వివిధ పంటల విత్తనోత్పత్తి జరుగుతూ, కేవలం రాష్ట్ర అవసరాలకే కాకుండా దేశ అవసరాలను తీర్చే స్థాయికి ఈ రంగాన్ని తీసుకెళ్లారన్నారు. మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. విత్తనోత్పత్తి రంగంలో లక్ష కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి పొందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనోత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com