Puvvada Ajay : మంత్రి పువ్వాడ అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏపీ కేబినెట్‌లో..!

Puvvada Ajay : మంత్రి పువ్వాడ అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజికవర్గమంతా రాజకీయాలు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కమ్మ సామాజిక వర్గంలో తనకు మంత్రి పదవి ఇవ్వడం అదృష్టమని చెప్పుకొచ్చారు.. ఏపీలో ఉన్న ఆ సామాజిక వర్గ మంత్రి నానిని తొలగించారని గుర్తుచేశారు.. ఇక్కడ తనను కూడా తొలగించేందుకు నిందలు మోపి కుట్రలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గ మంత్రులపై కుట్రలు పన్ని తొలగించే ప్రయత్నం జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీఆర్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు మంత్రి పువ్వాడ అజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com