UTTHAM: నేడు కాళేశ్వరానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ-NDSA నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న తాత్కాలిక మరమ్మత్తుల పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఇంజనీర్లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను మంత్రి పరిశీలించనున్నారు. మూడు ఆనకట్టల నిర్మాణ సంస్థలైన ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కావాలని మంత్రి కార్యాలయం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని... మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ సాయిల్ మెటీరియర్ రీసెర్చ్ స్టేషన్-CSMRS నిపుణుల బృందం పరీక్షలు చేపట్టిన వేళ.... మంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు ఎన్నికల కోడ్ ముగియడంతో నేటి నుంచి తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభంకానుంది. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో.. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇంచార్జి,రాష్ట్రప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాభవన్ లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ వల్ల. మార్చి 16 నుంచి ప్రజావాణిని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున రేపటి నుంచి మళ్లీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు.
చంద్రబాబుకు రేవంత్ ఫోన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. శాసనసభకు ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను, ఓటింగ్ వివరాలను గవర్నర్ కు మీనా సమర్పించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గెలుపొందిన అభ్యర్ధుల జాబితాతో కూడిన నివేదికను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో..... లోక్ సభకు ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను లోక్ సభ సచివాలయానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com