TS: ఖమ్మంలో నేడు మంత్రుల రైతు భరోసా సదస్సు

TS: ఖమ్మంలో నేడు మంత్రుల రైతు భరోసా సదస్సు
రైతు భరోసా పథకం అమలు విధి, విధానాలు రూపకల్పన కోసం ఖమ్మంలో మంత్రుల పర్యటన

రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపకల్పన కోసం నేటి నుంచి మంత్రుల కమిటీ జిల్లాల పర్యటన చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా తెలంగాణ సర్కార్ కమిటీ ఖరారు చేసింది. ఈ కమిటీ నేటి నుంచి 23వ వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సదస్సులు నిర్వహించనుంది.

నేడు ఖమ్మంలో పర్యటన

నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపకల్పన కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది. ఇందులో భాగంగా ఖమ్మంలో సదస్సు నిర్వహించనుంది. ఈ రైతు భరోసా సదస్సులో ముగ్గురు మంత్రులు పాల్గొననున్నారు. రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు రైతు సదస్సులు, ఐదు ఎకరాలు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు చేయనున్నారు. రైతు సదస్సులు పూర్తి అయ్యాక అసెంబ్లీలో రైతు భరోసాపై ప్రభుత్వం చర్చించనుంది. అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధివిధానాలను రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా స్కీం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే రైతు భరోసా కు నిధులు చెల్లిస్తారు కాబట్టే ప్రజా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది.

రేవంత్‌ సమీక్ష

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య సదుపాయాలపై రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలు ప్రభుత్వం పాటిస్తుందని అన్నారు.

Tags

Next Story