Telangana News : 8 మందికి క్లీన్ చిట్.. ఆ ఇద్దరిపై వేటు..?

Telangana News : 8 మందికి క్లీన్ చిట్.. ఆ ఇద్దరిపై వేటు..?
X

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల విచారణ తుది దశకు చేరుకుంది. బిఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ల ఆధారంగా ఇప్పటివరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరిపి 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఈ కేసులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు మాత్రమే మిగిలారు. ఈనెల 19న కడియం శ్రీహరిని మరోసారి విచారించబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అయితే కడియం శ్రీహరి ఎంపీ ఎన్నికల్లో తన కూతురు తరపున ప్రచారం చేయడం వల్ల కీలకమైన ఆధారం లభించినట్లు అయింది. అలాగే దానం నాగేందర్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్వయంగా పోటీ చేశారు.

ఇలా వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరినట్టు పక్కా ఆధారాలు ఉండటం వల్ల వేటు తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే వీరిద్దరి విచారణను చివరిదాకా కొనసాగించినట్లు తెలుస్తోంది. కడియం శ్రీహరి రీసెంట్ గా మాట్లాడుతూ తాను ఇంకా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. అటు దానం నాగేందర్ కూడా తాను కాంగ్రెస్ లో చేరలేదని.. ఇంకా బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. కానీ ఒకవేళ అనర్హత వేటు పడితే ఉప ఎన్నికకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వీరిద్దరూ చాలాసార్లు హిట్ ఇస్తున్నారు. మరి వీరిద్దరి వ్యవహారంలో గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.

ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పీకర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నా సరే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే చట్టాలను తుంగలో తొక్కినట్టే అంటున్నారు. రాజకీయ ఒత్తిడిలకు లొంగిపోయిన స్పీకర్ ఇలాంటి తీర్పులు ఇవ్వటం కరెక్ట్ కాదంటున్నారు గులాబీ నేతలు. అదే సమయంలో తమ న్యాయపోరాటం ఇంకా కొనసాగిస్తామని కూడా చెబుతున్నారు. స్పీకర్ ఇప్పటివరకు ఎనిమిది మందికి క్లీన్ చీట్ ఇవ్వడం వేరు.. ఇప్పుడు కడియం శ్రీహరికి, దానం నాగేందర్ కు క్లీన్ చిట్ ఇవ్వడం వేరు. అందుకే ఈ వ్యవహారంలో న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.


Tags

Next Story