Telangana MLA Disqualification Case : కడియం, దానం పిటిషన్ పై తీర్పు రిజర్వు.. వేటు తప్పదా..

Telangana MLA Disqualification Case : కడియం, దానం పిటిషన్ పై తీర్పు రిజర్వు.. వేటు తప్పదా..
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లో ఎట్టకేలకు తీర్పు రిజర్వు అయింది. ఈ కేసులో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఇప్పటికే రెండు సార్లు వీరిని విచారించిన స్పీకర్.. ఎట్టకేలకు తీర్పును రిజర్వు చేశారు. అతి త్వరలోనే తన తీర్పును వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి తీర్పును ఒకేసారి వెల్లడించే ఛాన్స్ ఉంది. చూస్తుంటే వేటు తప్పేలా లేదనిపిస్తోంది. ఎందుకంటే వీరిద్దరి వ్యవహారం లీగల్ గా చాలా సమస్యలు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ స్వయంగా కాంగ్రెస్ బీఫాం మీద ఎంపీగా పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి తన కూతురు కోసం వరంగల్ లో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ లెక్కన వీరిద్దరూ పార్టీ మారినట్టు ప్రత్యక్ష సాక్ష్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే వీరిద్దరినీ లాస్ట్ లో విచారించినట్టు ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేందుకు తాను రెడీ అని ఇప్పటికే పలుసార్లు తేల్చి చెప్పారు. అటు కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ ఎస్ లోనే ఉన్నానని అంటున్నారు. కానీ ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థుల వైపునే ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇటు దానం నాగేందర్ కూడా అంతే. ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇచ్చినా దానం నాగేందర్ కు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయిందని అంటున్నారు.

Tags

Next Story