Telangana Municipal Election : మున్సిపల్ ఉత్కంఠ.. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మట్లేదా..?

Telangana Municipal Election : మున్సిపల్ ఉత్కంఠ.. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మట్లేదా..?
X

మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. దాంతో ఏ పార్టీకి మున్సిపల్ లో ఎన్ని సీట్లు అనేది తేలిపోతుంది. దీంతో క్షణక్షణం ఉత్కంఠ నడుస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. ఎవరెవరు అనుకూల ఓటేశారు అనేది తేల్చుకుంటున్నారు. ఇంకోవైపు పార్టీలు కూడా ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తూనే.. తమ అంచనాలకు తగ్గట్టు ఉన్నాయా లేదా అనేది బేరీజు వేసుకుంటున్నాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ ఎస్ కు మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కటి కూడా దక్కదని వచ్చింది. దీనిపై బీఆర్ ఎస్ లోనూ ఆందోళన కొనసాగుతోంది.

అయితే అటు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు బీఆర్ ఎస్ బలమైన పోటీ ఇచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీకి మున్సిపాలిటీల్లో అనుకున్నంత సీట్లు రాలేదు. ఈ క్రమంలోనే మూడు పార్టీలు ఒక్కొక్క విషయంలో ఎగ్జిట్ పోల్స్ ను పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి అసెంబ్లీ ఎన్నికలు లేదా ఎంపీ ఎన్నికల్లో ఎక్కువగా పనిచేస్తుంటాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో వాటి ఫలితాలు నిజం కాకపోవచ్చని పార్టీలు భావిస్తున్నాయి.

పైగా తాము కష్టపడ్డ తీరు, వేసిన ఓట్లు, ప్రచార పర్వాలను లెక్కించుకుంటూ సొంత అంచనాలు వేసుకుంటున్నారు అభ్యర్థులు. దీంతో పార్టీలు కూడా అప్పుడే ఓ అంచనాకు రాకుండా ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనేది తేలితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ బలంగా ఉండటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags

Next Story