Telangana: ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు..

Telangana: తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్షగట్టి వ్యవహరిస్తోందని TRS లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. MSP నిర్ణయించిన ధరకే కొనుగోలుకై నామా డిమాండ్ చేశారు. అటు వడ్ల కొనుగోలుపై కేంద్రం దిగిరాకుంటే ఉద్యమం తప్పదన్న ఎంపీ కేశవరావు...టీఆర్‌ఎస్‌కు పోరాటాలు కొత్తకాదన్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో TRS శ్రేణులు ఏర్పాటు చేసిన హోర్డింగులు ఆసక్తి రేపుతున్నాయి.
ఒకే దేశం, ఒకే ధాన్యం సేకరణ నినాదం ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపటమేగాక రైతాంగం పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ హోర్డింగులు వెలిశాయి. ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీసేలా హోర్డింగులు అప్పడే విస్తృతమై చర్చకు తెరలేపాయి. సిల్లీ రాజకీయాల కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.
పరిపాలన చేతకాకే... కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసం కక్కుర్తి తప్ప... మరొకటి లేదని ఆరోపించారు. మహిళలను టీఆర్‌ఎస్ అగౌరవపరుస్తోందన్నారు బండి సంజయ్. రైతులను మోసం చేసి దీక్షలు చేస్తారా అంటూ మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఆర్వింద్. ఢిల్లీలో ధర్నా కోసం టీఆర్‌ఎస్ నేతలకు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఏసీ రూంలు తీసుకున్నారని... కమీషన్ల కోసం టీఆర్‌ఎస్ కక్కుర్తిపడుతుందన్నారు.
రైస్ మిల్లర్లకు ఎక్స్ పోర్ట్ లైసెన్స్ ఇచ్చారా అని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్. ఢిల్లీలో సై అంటే సై అంటున్నారు బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు. ధాన్యం కొనేవరకూ పోరాడతామని టీఆర్‌ఎస్ చెబుతోంది. ఇటు టీఆర్‌ఎస్ కూడా అదే స్థాయిలో హడావిడి చేస్తోంది. ఈ ధర్నాతో అయిన కేంద్రం దిగివస్తుందా..? లేక రాజకీయాల నుంచి తప్పుకుంటుందో వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com