ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ ను పిలుస్తారా..?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దుమారం రేపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. ఇక ఈ రోజు బీఆర్ ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావును విచారించబోతున్నారు అధికారులు. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే వీరందరినీ పిలుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసు ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్తుందనే పెద్ద ప్రచారంగా మారింది. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను పిలిచారు. తర్వాత ఎవరిని పిలవబోతున్నారనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. చూస్తుంటే ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించబోతున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే వారం గ్యాప్ లోనే బీఆర్ ఎస్ లో కీలకమైన ఈ ముగ్గురిని విచారించింది సిట్. కాబట్టి కేసీఆర్ కు కూడా అతిత్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి విచారణకు అయినా వస్తామని బీఆర్ ఎస్ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాము సింగరేని బొగ్గు కుంభకోణాలు బయటపెడుతున్నందుకే ఇలాంటి విచారణ పేరుతో వేధిస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు చెబుతున్నారు.
అటు కాంగ్రెస్ నేతలు మాత్రం.. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతో మందిని వేధించారని.. అందుకే వాళ్లను విచారిస్తున్నట్టు చెబుతున్నారు. తప్పు ఎవరు చేసినా వదిలేది లేదంటున్నారు. హరీష్ రావు విచారణకు వెళ్లిన రోజే.. తనకు కూడా నోటీసులు ఇస్తారని కేటీఆర్ అన్నారు. ఆయన చెప్పినట్టే రెండు రోజులకే విచారణకు పిలిచారు. ఇప్పుడు సంతోష్ రావు.. తర్వాత లిస్టులో కవిత, కేసీఆర్ కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. వారు కూడా విచారణకు వస్తే ఈ కేసు రాజకీయంగా హాట్ టాపిక్ కావడం ఖాయం అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
