Telangana News : తెలంగాణలో ఫోన్ టాపింగ్ ప్రకంపనలు.. ఎవరి వాదన వారిదే

Telangana News : తెలంగాణలో ఫోన్ టాపింగ్ ప్రకంపనలు.. ఎవరి వాదన వారిదే
X

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ టాపింగ్ మీద సిట్ విచారణ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ను కూడా సిట్ అధికారులు విచారించడం తీవ్ర కలకలం రేపేంది. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ నేతలు ఆందోళన, నిరసనలు తెలిపారు. కెసిఆర్ సిట్ విచారణ జరుగుతున్నంత సేపు నంది నగర్ లో, తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. సిట్ విచారణ మీద బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని అవినీతిపై నిలదీస్తుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి పసలేని విచారణలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సుప్రీం కోర్టు కూడా ఈ కేసును కొట్టేస్తే కక్ష సాధింపు కోసమే సిట్ విచారణ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. అటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ కేసు చాలా పెద్దదని.. అనేకమంది పర్సనల్ ఫోన్లను వినడం చాలా నేరం అంటున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని విడిచి పెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సిట్ అధికారులు అనేకమందిని ఈ కేసులో విచారించారు. చిట్ట చివరకు కేసీఆర్ ను విచారించినట్లు తెలుస్తోంది. మరి కెసిఆర్ తర్వాత ఇంకెవరినైనా విచారిస్తారా లేదా ఇక్కడితో ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

కానీ ఈ కేసులో నిజానిజారును వీలైనంత త్వరగా బయట పెడితేనే బెటర్ అంటున్నారు ఇరుపార్టీల కార్యకర్తలు. ఎందుకంటే ఇలాంటి ఫోన్ టాపింగ్ వల్ల డబ్బున్న పెద్ద వాళ్ళ ఫోన్ లే విన్నప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారింది. కాబట్టి అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ ఫోన్ టాపింగ్ లో నిజానిజాలను సిట్ అధికారులు త్వరలో బయటపెడతారా.. లేదంటే తాత్సారం చేస్తారా అనేది తెలియాలి. కానీ ఈ కేసు కొనసాగినంతసేపు తెలంగాణ రాజకీయాల్లో అలజడి ఎప్పుడూ ఉండేలా కనిపిస్తోంది.

Tags

Next Story