Harish Rao : హరీష్ రావుకు సిట్ నోటీసులు.. ఏం జరగబోతోంది..?

Harish Rao : హరీష్ రావుకు సిట్ నోటీసులు.. ఏం జరగబోతోంది..?
X

తెలంగాణ రాజకీయాల్లో సంచలన ఘటన జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. నేడు ఆయన్ను విచారణకు పిలిచింది. దీంతో మాజీ మంత్రి హరీష్‌ రావు సిట్ విచారణకు హాజరు అవుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లారు. కానీ హరీష్‌ రావు స్థాయి నేతను విచారణకు పిలవడం అంటే.. బీఆర్ ఎస్ ను డైలమాలో పడేసే అంశమే అంటున్నారు రాజకీయ నిపుణులు. అటు బీఆర్ ఎస్ మాత్రం.. తమకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని.. హరీష్‌ రావును రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును గతంలోనే సుప్రీంకోర్టు కొట్టేసిందని.. కానీ కక్షపూరితంగా మళ్లీ విచారణకు పిలుస్తున్నారంటూ మండిపడ్డారు.

అటు కాంగ్రెస్ నేతలు మాత్రం.. తప్పు చేశారు కాబట్టే విచారణకు పిలుతుస్తున్నారంటూ సిట్ వ్యవహరాన్ని సమర్థిస్తున్నారు. ఓ మీడియా ఛానెల్ అధినేత ఇచ్చిన స్టేట్ మెంట్ మేరకు హరీష్‌ రావును విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. కానీ హరీష్‌ రావు ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనేదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణకు హాజరు అయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇలా జరుగుతోంది. అటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్ రేసులో విచారణకు వెళ్లి వచ్చారు. ఆ కేసులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.

ఇలా బీఆర్ ఎస్ లోని అగ్ర నేతలు అందరూ సిట్ విచారణకు హాజరు అవుతూనే ఉన్నారు. హరీష్‌ రావు నుంచి కీలక విషయాలు సేకరించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకే హరీష్‌ రావును ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి హరీష్‌ రావుతోనే ఈ విచారణ పరిమితం అవుతుందా.. లేదంటే ఇంకా బీఆర్ ఎస్ నుంచి నేతలు ఎవరైనా వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Tags

Next Story