Telangana Political : తెలంగాణలో రాజకీయ హోరు.. మారుతున్న పరిణామాలు.

తెలంగాణలో రాజకీయ హోరు.. మారుతున్న పరిణామాలుతెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రజల్లో తమ బలం ఏంటని చూపించుకోడానికి మూడు పార్టీలు ప్రధానంగా పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీల నుంచి జంపింగ్ లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటిదాకా కాస్త నెమ్మదిగా జరిగిన ఈ జంపింగ్ లు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్, అసెంబ్లీ సభ్యుల స్థానాలను పెంచడానికి ప్లాన్ రెడీ చేస్తుంది. దీంతో ఈ పెంచుతున్న సీట్ల సంఖ్య తెలంగాణలో ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది ఏ పార్టీకి నష్టం వాటిల్లెలా చేస్తుంది అని లెక్కలను వేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ పట్టణం నిరూపించుకోవడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చూస్తోంది.
అటు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున బలంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఇప్పటినుంచి క్రమంగా ప్రజల్లోనే ఉంటూ తమ ఉనికిని మరింత పెంచుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధినేత కేసిఆర్ ఇప్పటికే నేతలకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే కెసిఆర్ కూడా ప్రజల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. అటు బిజెపి కూడా అధికారం కోసం బలంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పెద్దలు కూడా తెలంగాణ బిజెపి నేతలకు బలమైన వార్నింగులు ఇచ్చినట్టు సమాచారం. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి అందరూ కలిసికట్టుగా అధికార పార్టీపై పోరాడి ప్రజల్లో పట్టు పెంచాలని సూచించారు అంట ఢిల్లీ పెద్దలు. ఈ మేరకు తెలంగాణ బిజెపి నేతలు కూడా శరవేగంగా ఫీల్డ్ లోకి వచ్చేసి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు.
ఇలా మూడు పార్టీలు కూడా రాబోయే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని ప్రజల్లో తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఒకవేళ ప్రభుత్వం అసెంబ్లీ స్థానాలను పెంచితే అది తమకు అనుకూలంగా మారేలా మూడు పార్టీలు కూడా ముందస్తు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. దీంతో ఆయా పార్టీలు స్పీడుగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడి నుంచి మరొక లెక్క అన్నట్టు పార్టీలు బలంగా పోరాడుతున్నట్టు కనిపిస్తుంది.
Tags
- Telangana politics
- Telangana elections
- Congress party
- BRS
- BJP
- political developments
- party defections
- delimitation
- assembly seat increase
- parliamentary constituencies
- KCR
- Telangana Congress
- Telangana BJP
- electoral strategies
- Indian politics
- upcoming elections
- political competition
- governance and promises
- opposition strategy
- political landscape
- Telangana News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
