Telangana : తెలంగాణకు 2 జాతీయ అవార్డులు

తెలంగాణ రాష్ట్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల అవార్డులు పొందాయి. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీల్లో పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో ‘క్రాఫ్ట్స్’ కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్ ఎంపిక కాగా.. ‘స్పిరిచ్యువల్ వెల్నెస్’ కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను శుక్రవారం ప్రదానం చేసింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల ఎంపికైన నేపథ్యంలో ఆ గ్రామాలకు చెందిన అధికారులు అవార్డులను అందుకున్నారు. నిర్మల్ జిల్లా నుంచి అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య... సోమశిల నుంచి పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహా ఈ అవార్డులను అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com