Telangana RTC : తెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.115కోట్లు!

సంక్రాంతి సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6వేల ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం రూ.115 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 5వేల బస్సులు నడపగా, రూ.99కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 10-12, 19,20 తేదీల్లో TGSRTC బస్సుల్లో 50శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి.
గతేడాది సంక్రాంతి పండగ ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది దాదాపుగా రూ.16 కోట్లు అదనంగా వచ్చినట్లు చెప్తున్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ నెల 19, 20 తేదీల్లోనూ ప్రత్యేక బస్సులు నడిపింది. మొత్తం ఈ ఐదు రోజుల్లో నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా 50 శాతం పెంచిన అదనపు చార్జీలతో కలిపి మొత్తం రూ.115 కోట్ల వరకు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఒకటి ,రెండు రోజల్లో అధికారికంగా ఈ ఆదాయాన్ని ప్రకటించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com