Konda Surekha : తెలంగాణ శైవక్షేత్రాలు మెరిసిపోవాలి.. కొండా సురేఖ ఆదేశాలు

మహా శివరాత్రి పర్వది నాన్ని పురస్కరించుకుని అన్ని శైవక్షేత్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌ కర్యం కలగకుండా పోలీసు, మున్సిపల్, విద్యుత్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఉపవాస దీక్షలో ఉండే భక్తులకు ఉచితంగా పండ్లు, అల్పాహార పంపిణీ చేయాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో మహా శివరాత్రి పండుగను పురస్కరిం చుకుని ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహా శివరాత్రి పర్వ దినం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర రామలింగేశ్వర స్వామి, ఏడుపాయల వన దుర్గా భవానీ అమ్మవారు, రామప్ప, మేళ్ళచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం, చాయా సోమేశ్వర ఆలయం పానగళ్ళు, సోమేశ్వర దేవస్థానం పాలకుర్తి, వెయ్యి స్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశిబుగ్గ ఆలయం, భద్రకాళి, తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి సురేఖ సమీక్షించారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్ మెంట్, తాగునీరు వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com